
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు
Jun 8 2026 5:26 PM | Updated on Jun 8 2026 5:29 PM
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.
తాజాగా పెద్ది టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది మూవీ కథకు స్ఫూర్తి ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు. ఇది ఒక ఆదర్శమైన కథ అని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను బయటి ప్రపంచానికి పరిచయం పెద్ది మూవీ ఉద్దేశమని బుచ్చిబాబు అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియానే పెద్ది కథకు స్ఫూర్తి అని తెలిపారు. మట్టిలో ఆటగాళ్లను వెతుకుదాం.. ఓట్లలాగే ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను కూడా అడుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండియాకు మెడల్స్ తీసుకొచ్చేలా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే ఖేలో ఇండియా ఉద్దేశమన్నారు. భారత జీవన విధానంలోనే ఆట కూడా ఓ భాగమని చెప్పాలనుకున్నా.. అందుకే పెద్దిని మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. పెద్ది అనేది కమర్షియల్ చిత్రం కాదన్నారు. ఈ మూవీ గ్రామీణ క్రీడాకారుందరికీ ఆదర్శమని బుచ్చిబాబు తెలిపారు.
బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
Big Update: ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు, మోసాల చిట్టా లీక్..
టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఆఫ్ఘన్ ను చిత్తు చేసిన టీమిండియా
హై అలర్ట్..ఎబోలా టెన్షన్, గాంధీ ఆస్పత్రిలో 2 అనుమానిత కేసులు
భూమి వైపు దూసుకొస్తున్న మహా ప్రళయం, టోటల్ బ్లాక్అవుట్!
గేర్ మార్చిన రాధాకృష్ణ.. అమరావతి గుట్టు బట్టబయలు..