
వారెవ్వా వాల్నట్స్ ..ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు!వారెవ్వా వాల్నట్స్ ..ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు! 08 June 2026 Jyothi Gadda చూడటానికి మానవ మెదడు ఆకారంలో ఉండే
వాల్నట్స్.. నిజంగానే మెదడు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి. అయితే చాలామంది వీటిని మార్కెట్ నుండి తెచ్చుకుని నేరుగా తింటారు. డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే వీటిని నేరుగా తినడం కంటే, రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి రెట్టింపు పోషకాలు అందుతాయి.
వీటిని నేరుగా తింటే జీర్ణం కావడం కొంచెం కష్టమవుతుంది. కానీ, రాత్రిపూట నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ ఎంజైమ్‌లు తొలగిపోయి, శరీరం ఇందులోని పోషకాలను, విటమిన్లను పూర్తిగా గ్రహించడానికి వీలవుతుంది.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను చురుగ్గా ఉంచి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను అద్భుతంగా పెంచుతాయి. చిన్నపిల్లలకు తినిపించడం వల్ల మేధోశక్తి పెరుగుతుంది.
నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండి, గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
నిరంతరం రక్తంలో చక్కెర స్థాయిలతో బాధపడేవారికి నానబెట్టిన వాల్నట్స్ మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఉదయాన్నే వీటిని తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, అతిగా తినరు. బరువు అదుపులోకి వస్తుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ దానిమ్మ ఆరోగ్యానికి వరమే.. కానీ, ఈ రోగులకు మాత్రం శాపం! – ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! బొప్పాయి అమృతమే..కానీ, వీళ్లు తిన్నారంటే కష్టమే!