
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Peddi As 3rd 200 Crore Gross Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఆర్ఆర్ఆర్ తర్వాత సరైన సక్సెస్ లేని రామ్ చరణ్‌కు ‘పెద్ది’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా తొలి రోజే రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ కెరీర్లో మూడో రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టని చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాతో తొలిసారి రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమాతో మరోసారి రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ‘పెద్ది’తో మూడోసారి రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. ఈ రోజుతో ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించనుంది. ఈ రకంగా చూస్తే రామ్ చరణ్ ఖాతాలో రెండో రూ. 300 కోట్ల ప్రవేశించిన రెండో చిత్రంగా నిలవనుంది.
మొత్తంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సోలో హీరోగా తొలి రోజు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘పెద్ది’ రికార్డు క్రియేట్ చేసింది. వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్ఫణలో ఈ చిత్రం తెరకెక్కింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సన నుంచి రెండో చిత్రం ఇదే. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా.. ఆపై కుస్తీ యోధుడి.. చివర్లో పరుగుల వీరుడిగా మూడు విభిన్న పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో క్లైమాక్స్ గుండెలను పిండేసాలా ఉండటం.. అది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వసూల్లు వస్తున్నాయి. హిందీలో ఓ మోస్తరుగా కలెక్షన్స్ వస్తున్నా.. తమిళనాడు, కేరళలో సోది లేకుండా పోయింది. మొత్తంగా చూసుకుంటే ప్యాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రామ్ చరణ్ చేసిన ప్రమోషన్స్ పెద్దికి పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఈ సినిమా సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినట్టు మిగిలిన భాషల వాళ్లకు కనెక్ట్ కావపోవడం పెద్దికి పెద్ద మైనస్. ఇక ఈ చిత్రంతో రామ్ చరణ్ తొలిసారి నేషనల్ అవార్డు సాధిస్తాడని ఆయన అభిమానులతో పాటు క్రిటిక్స్ చెబుతున్న మాట. మరి క్రిటిక్స్ చెబుతున్నట్టు ‘పెద్ది’తో రామ్ చర్ జాతీయ అవార్డు సాధిస్తాడా లేదా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.