
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (61) మూడోసారి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. గత రెండేళ్లుగా తనతో రిలేషన్షిప్లో ఉన్న భాగస్వామి గౌరీ స్ప్రేట్ (47)ను జులై 5న వివాహం చేసుకోబోతున్నాడు
. ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసంలో అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రిజిస్టర్ మ్యారేజ్ చాలా ప్రైవేట్‌గా జరగనుంది. అయితే, 60 ఏళ్లు దాటిన వయసులో ఆమిర్ మూడో పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సీనియర్ నటి రాఖీ గుల్జార్ తీవ్రంగా స్పందించారు. ఆమిర్ నిర్ణయానికి ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు.తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాఖీ గుల్జార్ మాట్లాడుతూ.. "నాకు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విషయాలతో పెద్దగా సంబంధం లేదు. నేను ఆమిర్ ఖాన్‌తో ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. కానీ ఆయన చాలా నిజాయతీ గల వ్యక్తి అని నాకు తెలుసు. ఇద్దరు భార్యలతో (రీనా దత్తా, కిరణ్ రావు) విడాకులు తీసుకున్న తర్వాత కూడా వారితో ఆమిర్ ఇప్పటికీ మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న తీరు నాకు ఎంతగానో నచ్చింది. ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం" అని కొనియాడారు.వయసుతో పనేంటి?.. విమర్శకులకు చురకలు60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంపై వస్తున్న విమర్శలను రాఖీ గుల్జార్ పూర్తిగా కొట్టిపారేశారు. "60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే తప్పేంటి? హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డి నీరో తన 70, 80 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాలేదా? వివాహ జీవితంలో ఆనందం, తోడు అనేవి వయసును బట్టి నిర్ణయించబడవు" అని