
డీసీపీ రితిరాజ్ సీక్రెట్ ఆపరేషన్. సాధారణ దుస్తుల్లో పబ్‌లోకి ఎంట్రీ. కేపీహెచ్‌బీ పబ్ నిర్వాహకుల అరెస్ట్. Dcp Ritiraj: హైదరాబాద్ నగరంలో పబ్‌ల అక్రమ నిర్వాహణ, నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం
మోపుతున్నారు. తాజాగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి వేళ నిర్వహించిన ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. కేపీహెచ్‌బీ కాలనీలోని 'కింగ్స్ & క్వీన్స్' పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో ఆమె వినూత్న రీతిలో స్పందించి, ఎవరూ ఊహించని విధంగా మెరుపు దాడికి వ్యూహం రచించారు. Elon Musk: ప్రపంచ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. ఆ ఆస్తి విలువ తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం ఎలాంటి భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ కాన్వాయ్) లేకుండా, కేవలం సాధారణ దుస్తులలో ఒక సాధారణ కస్టమర్లా డీసీపీ రితిరాజ్(Dcp Ritiraj) ఆ పబ్‌లోకి ప్రవేశించారు. పబ్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి జరుగుతున్న కొన్ని అభ్యంతరకర, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఆమె స్వయంగా గమనించి, వాటికి సంబంధించిన ఆధారాలను రికార్డ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనను పూర్తిగా నిర్ధారించుకున్న వెంటనే, ఆమె స్థానిక కేపీహెచ్‌బీ పోలీసులను అప్రమత్తం చేసి పబ్‌పై అధికారికంగా దాడి చేయించారు. ఈ మెరుపు దాడిలో పోలీసులు పబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకోగా, మరికొంతమందిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక ఉన్నతాధికారి అయి ఉండి, సామాన్యురాలిలా పబ్‌లోకి వెళ్లి నిజా నిజాలు నిరూపించిన డీసీపీ రితిరాజ్ సాహసాన్ని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.