
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Mrigasira Karthi Fish Relation: మృగశిర కార్తె రాకతో వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్నే 'మృగశిర కార్తె' అంటారు. ఈ రోజున రైతులు విత్తనాలు చల్లి, పొలం పనులు మొదలుపెడతారు. అయితే మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. పల్లె అయినా, పట్నమైనా ఈ రోజున ప్రతి ఇంట్లో చేపల కూర గుమగుమలాడాల్సిందే. మరి ఈ కార్తెకు, చేపలు తినే సంప్రదాయానికి ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాతావరణ మార్పు – రోగనిరోధక శక్తి మృగశిర కార్తెకు ముందు వచ్చే రోహిణి కార్తెలో ఎండలు మండిపోతాయి. రోకళ్లు పగిలేంత ఎండల వల్ల ప్రజలు విపరీతమైన ఉక్కపోతకు గురై, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ వెంటనే మృగశిర రాకతో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, తొలకరి చినుకులు పడతాయి.
ఒక్కసారిగా వాతావరణం చల్లబడటాన్ని మానవ శరీరం తట్టుకోలేదు. ఈ తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెంది.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయి. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
ఈ కాలంలో వచ్చే జబ్బుల నుంచి తట్టుకోవడానికి మన పెద్దలు చేపలు తినే ఆనవాయితీని తెచ్చారు. దీని వెనుక బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి. వాతావరణం చల్లబడినప్పుడు శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. చేపలు తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా మారుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులకు అవసరమైన వేడిని అందిస్తుంది. వర్షాల వల్ల శరీరంలో కఫం, వాత దోషాలు పెరుగుతాయి. చేపలు ఈ కఫాన్ని నియంత్రించి శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తాయి.
అలాగే చేపల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఎంతో మేలు చేస్తాయి.
తొలి వానలు పడగానే రైతులు రాత్రింబవళ్లు పొలం పనుల్లో మునిగిపోతారు. ఆ సమయంలో వచ్చే ఒళ్లు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందడానికి కూడా చేపలు దోహదపడతాయి. అందుకే "మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు" అనే సామెత కూడా పుట్టింది.
అంతేకాకుండా.. దీర్ఘకాలిక ఆస్తమా, ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం ఈ రోజున ప్రత్యేకంగా అందించే 'చేప ప్రసాదం' (చేప మందు) తీసుకోవడానికి కూడా దేశం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తుంటారు. మృగశిర కార్తె నాడు చేపలు తినడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.