
కేంద్ర కేబినెట్ విస్తరణకు (Union Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. మోడీ సర్కార్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేబినెట్లో కీలక మార్పులు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా
ఇప్పటికే పలు సంకేతాలు ఇచ్చింది. కేంద్ర కేబినెట్లోని ఇద్దరు రాజ్యసభ సభ్యులకు పొడిగింపు ఇవ్వలేదు. అలాగే మరికొందరిని తప్పించి పార్టీ బాధ్యతల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పుడు మరో కొత్త పేరును కేబినెట్ బెర్తు కోసం పరిశీలిస్తోంది. కేంద్ర కేబినెట్లోకి నితిన్, నితీష్..! ఆ నలుగురూ అవుట్..!ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ అయి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో విభేదించి బీజేపీ పంచన చేరిన రాఘవ్ చద్దా (Raghav Chadha)ను ఈసారి కేబినెట్లోకి తీసుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగి జనం దృష్టిలో పడ్డ ఆయన్ను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా సానుకూలత వస్తుందని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పంజాబ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో పంజాబ్ ఎన్నికలకు ముందు రాఘవ్ చద్దాను తీసుకుంటే కలిసిసొస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. మోడీ కేబినెట్ నుంచి ఇద్దరు అవుట్ ? విస్తరణకు ముందే షాక్..!మరోవైపు రాఘవ్ చద్దాను కేబినెట్లోకి తీసుకుంటే ఆయనకు ఏదైనా కీలక మంత్రిత్వ శాఖ అప్పగించేందుకు కూడా బీజేపీ రంగం సిద్దం చేస్తోంది. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఇది తమకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. రాఘవ్ చద్ధాతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేరును కూడా బీజేపీ పరిశీలిస్తోంది. పంజాబ్ కోటా నుంచి వీరిద్దరికీ అవకాశాలు ఉన్నాయి. తరుణ్ చుగ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడైన నేత కూడా. పంజాబ్ నుంచి ఆరెస్సెస్‌తో ఆయనకు దీర్ఘకాల అనుబంధం ఉంది. జమ్ము-కశ్మీర్, తెలంగాణ, లడఖ్‌లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తరుణ్ చుగ్ కు కూడా కీలక మంత్రిత్వ శాఖ దక్కవచ్చని అంచనా.