
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి
Jun 8 2026 9:30 AM | Updated on Jun 8 2026 9:30 AM
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్‌కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సమావేశానికి విజయ్ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.
అయితే లోపల సఖ్యతగా కనిపిస్తున్న ఈ కూటమిలో విజయ్ అంశం తీవ్ర కలకలానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల అనంతరం దశాబ్దాల మిత్రపక్షమైన డీఎంకేను పక్కనబెట్టి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో, అటు డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించడం, ఇటు సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కకపోవడంతో కూటమిలో సరికొత్త రాజకీయ సమీకరణలు చర్చనీయాంశంగా మారాయి. ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
నన్నే కాదంటారా.. కడప రెడ్డెమ్మ భర్త తిరుగుబాటు
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్