
శిథిలావస్థకు చేరిన 117 గేట్లు మార్చి కొత్తవి ఏర్పాటు రూ.150 కోట్లతో టెండర్లు పిలిచి పనుల అప్పగింత ఈనాడు- అమరావతి: గోదావరి నదిపై కాటన్ మహాశయుడు నిర్మించి.. మళ్లీ 1980లో కొత్తరూపు సంతరించుకున్న
ధవళేశ్వరం బ్యారేజి ఆధునికీకరణకు 46 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మోక్షం కలుగుతోంది. 2014లో కొన్ని పనులు చేశారు. ఆ తర్వాత డ్యాం భద్రతా నిపుణులు ఈ బ్యారేజి దుస్థితిపై నివేదిక ఇచ్చినా వైకాపా హయాంలో పైసా కూడా విదల్చలేదు. ఇప్పుడు రూ.150 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. బెకం సంస్థ రూ.124.34 కోట్లకు పనులు దక్కించుకుంది. పనుల ప్రారంభానికి సమాయాత్తమవుతోంది. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. వీటిలో అన్నింటికన్నా కీలకం ఈ బ్యారేజిలో తుప్పు పట్టిన 117 గేట్లను మార్చి కొత్తవి ఏర్పాటు చేయబోతున్నారు.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 10.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ బ్యారేజీ నుంచి వెళ్లే నీళ్లే ఆధారం. 2014లో గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునికీకరణ కింద రూ.31.77 కోట్లతో పనులు చేపట్టారు. మొత్తం 175 గేట్లలో 58 గేట్లకు మాత్రమే అప్పట్లో మరమ్మతులు చేశారు. డ్యాం భద్రతా నిపుణులు 2019 నుంచి అనేకసార్లు ఈ బ్యారేజిని సందర్శించి నివేదికలు సమర్పించారు. మొత్తం గేట్లలో 117 శిథిలావస్థకు చేరుకున్నాయి. వందకు పైగా గేట్లలో బాటమ్ ప్లేట్లు తప్పు పట్టి రంధ్రాలుపడ్డాయి. 2019 తర్వాత ఈ బ్యారేజిని పట్టించుకున్న నాధుడు లేడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.