
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Udaan Scheme For Girls: నేటికాలంలోనూ ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సీబీఎస్ఈ ఉడాన్ స్కీమ్ కింద ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం కింద ఇంజనీరింగ్, టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్ లో బాలికల నమోదును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వేలాది మంది బాలికలకు ఇంజనీరింగ్ కాలేజీలో చేరేందుకు ఉచితంగా సహాయం అందిస్తారు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వారికి స్టడీ మెటీరియల్ ను కూడా అందుబాటులో ఉంచారు. దీనిలో వీడియోల ద్వారా అధ్యయనాలు భోధిస్తారు. అలాగే ఈ స్కీమ్ కింద దేశంలోని 60 కేంద్రాల్లో వర్చువల్ తరగతులు కూడా నిర్వహిస్తారు. దీనిలో ఆడపిల్లలకు ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందిస్తారు. అధ్యయన సమయంలో తలెత్తే సమస్యలను కూడా పరిష్కరిస్తారు.
ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు బాలికలు నవోదయ పాఠశాల, సెంట్రల్ స్కూల్ లేదా కేంద్ర, రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాల లేదా సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుకుని ఉండాలి. దీంతోపాటు పదవతరగతిలో కనీసం 70శాతం మార్కులు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 80శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే అమ్మాయి కుటుంబ ఆదాయం 6లక్షలకు మించి ఉండకూడదు.
-ఆదాయ ధృవీకరణ పత్రం (తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు)
-కేటగిరీ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ, వర్తిస్తే)
-పాఠశాల ధృవీకరణ పత్రం (ప్రిన్సిపాల్ సంతకం చేసినది)
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి పేరును రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడున్న అన్ని నియమాలను జాగ్రత్తగా చదివి తర్వాత దరఖాస్తు ఫారమ్ ను పూరించాలి. తర్వాత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారు. ఇది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ కు వస్తుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఆధార్ కార్డు, చిరునామా, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం ధ్రువీకరణ పత్రం, 10, 11 తరగతి మార్క్ షీట్స్, అవసరం అయితే బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఉండాలి.
2026-27 విద్యా సంవత్సరానికి గాను సీబీఎస్ఈ ఉడాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక చివరి తేదీని సీబీఎస్ఈ ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా, దరఖాస్తుల స్వీకరణ జూలై లేదా ఆగస్టు నెలల్లో ప్రారంభమవుతుంది. గడువు సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో ఉంటుంది. విద్యార్థులు ఖచ్చితమైన తేదీ కోసం సీబీఎస్ఈ అధికారిక అకడమిక్ వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి