
ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా- ఇరాన్ మధ్య పోరుతో గల్ఫ్ దేశాలు నలిగిపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్రదేశాల పునర్నిర్మాణానికి సాయం
అందించాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇరాన్‌కు చెందిన ఏ ఆస్తులను పరిగణనలోకి తీసుకున్నారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఇరాన్ ఆస్తులతో గల్ఫ్ మిత్రదేశాలకు అమెరికా సాయం? |