
"సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించడమే అసలైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశాలను సృష్టించేందుకే నేను రష్యాలో పర్యటిస్తున్నాను," అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా
లోకేష్ స్పష్టం చేశారు. తన రష్యా పర్యటనలో ఐదో రోజు ఆయన మాస్కోలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణ, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు.ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమావేశంమాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన ప్రవాస భారతీయుల (డయాస్పోరా) సమావేశంలో లోకేష్ ఉద్విగ్నభరితంగా ప్రసంగించారు. "మీరు భారతదేశాన్ని విడిచి వచ్చినా, భారతదేశం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, మన సంస్కృతి, సంప్రదాయాలను గుండెల్లో మోస్తున్న మీ విజయాలు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నాయి" అని ఆయన ప్రశంసించారు. భారత్-రష్యా బంధం అత్యంత విశ్వసనీయమైనదని, ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంలో ఈ స్నేహం మరింత బలపడిందని అన్నారు. అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీ దేశ కీర్తిప్రతిష్టలను చారిత్రక శిఖరాలకు చేర్చారని కొనియాడారు.అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కండిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని లోకేష్ వివరించారు. "యువ జనాభా, సుదీర్ఘ తీరప్రాంతం, ఆధునిక ఓడరేవులు మన బలం. పెట్టుబడులను ఆకర్షించి, వాటిని యువతకు ఉపాధిగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం," అని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఏరోస్పేస్ వరకు అనేక రంగాల్లో