
Ambedkar statue Unveiling: ప్రకాశం జిల్లా కనిగిరిలో శనివారం ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
read also: Chittoor: విచిత్ర ఘటన..మరణించిన నాలుగేళ్లకు పింఛన్ మంజూరు
గత వైసీపీ పాలనలో దళితులు అనేక అణచివేతలకు, ఇబ్బందులకు గురయ్యారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. దళిత సామాజికవర్గానికి చెందిన తనతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుపై కూడా గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని ఆమె ధ్వజమెత్తారు. ఆ రాజకీయ కక్షసాధింపు కేసుల కారణంగానే, తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ నేటికీ కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా అంబేద్కర్ విగ్రహాలను ఊరి చివరన ఏర్పాటు చేస్తుంటారని, కానీ దానికి భిన్నంగా కనిగిరి పట్టణ నడిబొడ్డున అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఇదే వేదికపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తండ్రి, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ సేవలను ఆమె స్మరించుకున్నారు. ఆరుగురు ప్రధానమంత్రుల వద్ద దేశాభివృద్ధి కోసం పనిచేసిన గొప్ప రాజకీయ ప్రస్థానం ఆయనదని అనిత కితాబునిచ్చారు.
కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు హోంమంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను ప్రస్తావిస్తూ.. విమర్శలు చేసేవారికి కేవలం ఆయన చేతిలోని ‘రెడ్‌బుక్’ మాత్రమే కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. అదే పాదయాత్రలో లోకేశ్ దేశ రాజ్యాంగాన్ని చేతబూని, చట్టబద్ధమైన పాలన కోసం నడిచిన విషయం ఎందుకు కనిపించడం లేదని ఆమె నిలదీశారు.
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణ తర్వాత కేసీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Vasamsetti Subhash: వైసీపీ ‘గండ్ర గొడ్డలి పార్టీ’.. మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nara Lokesh: మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత ఫైర్
Bolla Brahmanaidu: గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Chittoor: విచిత్ర ఘటన..మరణించిన నాలుగేళ్లకు పింఛన్ మంజూరు