
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని దూషించిన
ఆరోపణలపై కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
Read also: Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణ తర్వాత కేసీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు
పోలీసుల కథనం ప్రకారం.. జనసేన పార్టీ మద్దతుదారుడిగా చెప్పుకునే కొర్ర చందర్ లాల్, ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత ఒక వీడియోను రికార్డ్ చేశాడు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డాడు. “జనసేనతో పెట్టుకున్నావ్.. రేవంత్ రెడ్డి, నిన్ను బలి ఇస్తాం” అంటూ నేరుగా ప్రాణభీతి కలిగించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదాస్పద వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ వ్యవహారంపై సుమోటోగా స్పందించిన తెలంగాణ పోలీసులు చందర్ లాల్‌పై క్రైమ్ నంబర్ 395/2026 కింద కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు మరియు సోషల్ మీడియా వినియోగదారులకు కీలక విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట హద్దులు దాటి ప్రజాప్రతినిధులను, ఇతరులను బెదిరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
Lung Cancer Blood Test: లంగ్ క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే కొత్త రక్త పరీక్ష ఆవిష్కరణ
Bolla Brahmanaidu: గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్: రేపు ఆ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత ఫైర్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. సిట్ విచారణ తర్వాత కేసీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Nirmal District: భైంసా సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి అవసరం.. కలెక్టర్ భవేశ్ మిశ్రా
Komuravelli: తెలంగాణలో మరో కొత్త రైల్వే స్టేషన్ పనులు పూర్తి..పుణ్యక్షేత్రానికి నేరుగా రైలు ప్రయాణం