
సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని మంత్రి సవిత తెలిపారు. క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సేంద్రియ ఆహారం అవసరమని చెప్పుకొచ్చారు. అమరావతి, జూన్ 6: తాడేపల్లిలో ఆర్గానిక్ ఫామ్‌ను
మంత్రి సవిత సందర్శించారు. ఈరోజు(శనివారం) క్యాంప్ కార్యాలయం నుంచి సైకిల్‌పై ప్రాతూరు రోడ్డులోని ASR ఆర్గానిక్ వెజిటబుల్ ఫామ్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం సవిత మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. ఆర్గానిక్ కూరగాయలు ఆరోగ్య రక్షణకు మేలు చేస్తాయన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సేంద్రియ ఆహారం అవసరమని చెప్పుకొచ్చారు. 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో ASR ఫామ్ సాగు చేస్తోందని.. రసాయన ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరల సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకర జీవనానికి ఆర్గానిక్ వ్యవసాయం అవసరమని అన్నారు.
ఇంధన పొదుపు కోసం సైకిల్ వినియోగాన్ని మంత్రి ప్రోత్సహించారు. దగ్గర ప్రాంతాలకు కాలినడకన లేదా సైకిల్‌పై వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంధన వాహనాలు వినియోగించాలన్నారు. ప్రధాని మోదీ పిలుపు, సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
సడన్‌గా నిలిచిన ఇండిగో విమానం.. ఫ్లైట్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్