
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Budhaditya Rajayoga in June Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహ సంచారం ప్రజల జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇక జూన్ నెలలో గ్రహ స్థితులు చాలా శుభప్రదంగా మారబోతున్నాయి. ఒక బలమైన మార్పు ఈ సమయంలో సంభవించబోతోంది. జూన్ 15న సూర్య భగవానుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుద్ధికి కారకుడిగా భావించే.. బుధుడు ఇప్పటికే అక్కడ సంచార దశలో ఉండడంవల్ల ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం ఎంతో బలమైనదిగా, శక్తివంతమైనదిగా, శుభప్రదం అయిందిగా భావిస్తారు.
బుధాదిత్య అనే పదం బుధ, ఆదిత్య అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. బుధుడు, సూర్యుడు కలిసినప్పుడల్లా కొన్ని రాశుల వారికి ఈ యోగ ప్రభావంతో తెలివితేటలు పెరగడమే కాకుండా.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ సమయంలో వారికి ఆత్మవిశ్వాసం పెరిగి.. వృత్తి జీవితంలో విజయాలు కూడా సాధించగలుగుతారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ యోగ ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
మేషరాశి మేషరాశి వారికి బుధాదిత్య రాజయోగ ప్రభావంతో ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.. అంతేకాకుండా పెద్ద ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీతం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వ్యాపారంలో కూడా గొప్ప పురోగతి లభించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కుటుంబ సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అందరూ కలిసి ఎంతో బాధ్యతగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు..
వృషభరాశి వృషభ రాశి వారికి కూడా ఈ శక్తివంతమైన రాజయోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బాగా ఆలోచించగలుగుతారు. ఈ సమయంలో పనిలో అందరూ మీకు అండగా నిలుస్తారు. అలాగే జీతం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు అద్భుతమైన పదవులు కూడా పొందుతారు. వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులు పొందడమే కాకుండా ఈ సమయంలో సువర్ణ అవకాశాన్ని సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మిథున రాశి బుధాదిత్య రాజయోగ ప్రభావంతో మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. వ్యక్తిత్వం కొత్త రూపాన్ని సంతరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమయంలో అన్ని కష్టమైన పనులు సులభంగా చేయగలిగే అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు. వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా డబ్బుకూరతో తొలగిపోయి.. ఉద్యోగంలో భారీ పురోగతి లభించవచ్చు. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.