
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హర్మూజ్‌కు సమీపంలో ఇరాన్ డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశానికి చెందిన తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలే
లక్ష్యంగా దాడులు నిర్వహించింది. నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. ప్రాంతీయ సముద్ర రవాణాకు ఈ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని అందుకే తక్షణమే స్పందిచాల్సి వచ్చిందని అమెరికా సెంట్రల్ కమాండ్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది. ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడి |