
సెలబ్రిటీల రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారిన అలీబాగ్‌లో కన్నడ స్టార్ హీరో యశ్, ఆయన భార్య, నటి రాధికా పండిట్ భారీ పెట్టుబడి పెట్టారు. ముంబైకి సమీపంలోని ఈ తీర ప్రాంతంలో వారు రూ. 24 కోట్లు వెచ్చించి
సెలబ్రిటీల రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారిన అలీబాగ్‌లో కన్నడ స్టార్ హీరో యశ్, ఆయన భార్య, నటి రాధికా పండిట్ భారీ పెట్టుబడి పెట్టారు. ముంబైకి సమీపంలోని ఈ తీర ప్రాంతంలో వారు రూ. 24 కోట్లు వెచ్చించి విలాసవంతమైన బీచ్ ఫ్రంట్ ల్యాండ్‌ను కొనుగోలు చేశారు.రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 మే 18న ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయింది. రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్ తాలూకాలోని కామత్ గ్రామంలో సుమారు 1.3 ఎకరాల (5,289 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉన్న రెండు వ్యవసాయ భూములను యశ్ దంపతులు కొనుగోలు చేశారు. కిహిమ్ బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ ఆస్తికి పశ్చిమాన సముద్రం, తూర్పున గ్రామ రహదారి ఉన్నాయి.ఈ ఒప్పందం కోసం యశ్ దంపతులు రూ. 1.44 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 60,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఈ జంట, తమ అటార్నీ ద్వారా ఈ లావాదేవీని పూర్తి చేశారు. నసీమ్ ఇక్బాల్ హలీమ్, ఇఫత్ షఫీక్ అహ్మదీ అనే వ్యక్తుల నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్టు పత్రాల్లో నమోదైంది.అలీబాగ్ ఇప్పటికే బాలీవుడ్, క్రికెట్ తారలకు వీకెండ్ హోమ్‌గా మారింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్, సుహానా ఖాన్ వంటి ప్రముఖులు ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన యశ్ దంపతులు కూడా చేరడంతో అలీబాగ్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్