
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు భాజపాలో సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నేత రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ ప్రకటించారు. తన భవిష్యత్తు
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు భాజపాలో సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నేత రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ ప్రకటించారు. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆమె వెల్లడించలేదు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై, ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ సహా పలువురు కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అన్నామలై పార్టీలో చేరేందుకు కరు నాగరాజన్ సిద్ధమైనట్లు సమాచారం.
అన్నామలై రాజీనామాపై భాజపా స్పందిస్తూ.. ఆయన వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని పేర్కొంది. తమది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని.. సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుందని తమిళనాడు భాజపా అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని 28 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.