
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో కీలక అడుగులు వేస్తున్నారు. తన పర్యటనలో నాలుగో రోజు
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో కీలక అడుగులు వేస్తున్నారు. తన పర్యటనలో నాలుగో రోజు, ఆయన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రపంచ ప్రఖ్యాత అణుశక్తి దిగ్గజం రోసాటమ్ (Rosatom), అల్యూమినియం తయారీ సంస్థ రుసాల్ (RUSAL) ఉన్నత స్థాయి ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలు స్థాపించాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు, గ్లోబల్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొని, ఆర్కిటిక్ నూతన జలమార్గం ద్వారా ఏపీకి కలగనున్న ప్రయోజనాలను ప్రపంచానికి వివరించారు.రోసాటమ్తో భేటీ: ఏపీకి అణుశక్తి ఆధారిత పరిశ్రమలురష్యాకు చెందిన గ్లోబల్ న్యూక్లియర్ టెక్నాలజీ లీడర్ రోసాటమ్ డైరెక్టర్ (ఐటీ & డిజిటలైజేషన్) అబాకుమోవ్ ఎవ్ జెనీ, ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ క్వ్యాట్కోవ్స్కీ ఎగోర్‌తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అపార అవకాశాలను వివరిస్తూ పలు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో ఉన్న సువిశాల తీరప్రాంతాన్ని ఉపయోగించుకొని, పారిశ్రామిక వాడలకు 24/7 నిరంతరాయంగా స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించేందుకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (SMR) ఏర్పాటు చేయాలని లోకేష్ ఆహ్వానించారు. ఫార్మా, వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా న్యూక్లియర్ మెడిసిన్, ఫుడ్ ఇర్రాడియేషన్ సెంటర్‌ను స్థాపించాలని కోరారు. పారిశ్రామిక పార్కులలో నీటి కొరతను అధిగమించేందుకు న్యూక్లియర్ డీశాలినేషన్ ప్లాంట్‌ను నిర్మించాలని, అలాగే ఏరోస్పేస్, రక్షణ రంగాలకు అవసరమైన న్యూక్లియర్-గ్రేడ్ మిశ్రమ లోహాలు, కార్బన్-ఫైబర్ కాంపోజిట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని