
పంటకు అవసరమైన సమయంలో యూరియా లభించక రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరి యా పంపిణీని పారదర్శకంగా నిర్వహంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ప్ర యోజనం కంటే ఇబ్బందులను ఎక్కువగా కల్గిస్తున్నదని
పంటకు అవసరమైన సమయంలో యూరియా లభించక రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరి యా పంపిణీని పారదర్శకంగా నిర్వహంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ప్ర యోజనం కంటే ఇబ్బందులను ఎక్కువగా కల్గిస్తున్నదని జిల్లా రైతులు ఆవేదన చెందుతు న్నారు
చింతలమానేపల్లి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పంటకు అవసరమైన సమయంలో యూరియా లభించక రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరి యా పంపిణీని పారదర్శకంగా నిర్వహంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ప్ర యోజనం కంటే ఇబ్బందులను ఎక్కువగా కల్గిస్తున్నదని జిల్లా రైతులు ఆవేదన చెందుతు న్నారు. యాప్‌లో నమోదు, ఓటీపీ సమస్యలు, సర్వర్ డౌన్ కారణంగా యూరియా బుకింగ్‌లు సకాలంలో పూర్తికాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా రు. ర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎరువుల కోసం రోజుల తరబడి రైతు లు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వరి పంటకు ఎకరాకు 4 బస్తాల వరకు అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం 2 బస్తాల మాత్రమే అందజేస్తుండడంతో రైతులు అసంతృప్తి చెందుతున్నారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేసే యూరియా బస్తా ధర రూ. 266 కాగా ప్రైవేటు దుకాణాల్లో ఫర్టిలైజర్ షాపుల్లో రూ. 350 నుండి 450 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసికూడా మౌనం పాటించడం వెనుక అంతర్యం ఏంటన్న ప్రశ్నలు రైతుల్లో మెదులుతున్నాయి. సంబంధిత అధికా రులు సైతం ఫర్టిలైజర్ షాపుల యజ మానుల వద్ద భారీగా ముడుపులు తీసుకొని దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నా యి. దీనికి తోడు రవాణా ఖర్చులు కలుపుకొని ఇంటికి చేరుకొనే వరకు రూ. 500 వరకు ఒక్కో యూరియా బస్తాకు ఖర్చు అవుతుం దని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 15 మండలాల పరిధిలో కంది, పత్తి, వరి పంటలతో పాటు వివిధ పంటలు 4.6 లక్షల ఎఝరాల్లో సాగు చేస్తున్నట్లు అంచనా ఉండగా అందుకు సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. ఎకరాకు 4 బస్తాల యూరి యా అవసరం ఉండగా కేవలం యాప్ ద్వారా 2 బస్తాల యూరియా ఇవ్వడం, దానికి తోడు అనేక కొర్రీలు పెట్టడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రైతులు సాగు చేసే ప్రకారం 18.4 లక్షల భస్తాల యూరియాను జిల్లాకు ఇవ్వాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిర్ణయ ధర మేరకు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా పంపిణీ డీలర్ల చేతిలో పెట్టడంతో పక్కదారి పట్టే అవకాశం ఉన్నదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
యూరియా బుకంగ్ పూర్తిగా యాప్ ఆధారంగా సాగుతుండడంతో స్మార్ట్ ఫోన్ లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్దులు, సాంకేతిక పరిజ్ఞానం లేని వారు బుకింగ్ కోసం ఇతురులపై ఆదారపడాల్సి వస్తున్నది. యాప్‌లో బుక్ చేసిన తర్వాత కూడా ఎరువులు ఎప్పుడు అందుతాయోననే విషయంలో స్పష్టత లేకపోవ డంతో ఎరువుల కేంద్రాల చుట్టూ తిరగాల్సివ స్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఓటీపీలు ఆలస్యంగా రావడం, సర్వర్ డౌన్ కావ డం, యాప్ పని చేయకపోవడం, వంటి సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అవగాహన లోపం, సాంకేతిక సమస్యల కారణంగా అనేక గ్రామాల్లో రైతులు ఎరువుల బుకింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆఫ్‌లైన్ విధానం ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైతులకు ఎంత అవసరం ఉంటే అంత యూరియా దొరికేదని ప్రస్తుతం కేవలం ఎకరాకు 2 బస్తాల యూరియా ఇస్తూ అనేక కొర్రీలు పెడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు యూరియా బస్తాలు సరిపోవని, గతంలో ఎకరాకు 4 బస్తాలు యూరియా వేశామని ఇప్పుడు 2 బస్తాల యూరి యా వేస్తే పంటల దిగుబడులు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సాగు సీజన్ కు రైతులు సిద్దం అవుతున్న నేపథ్యంలో యూరి యా సరఫరా ప్రక్రియను మరింత సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా యంత్రాంగం రైతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల ని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్న డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు రైతులను మోసగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు, రైతుల సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయం పై జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌ను వివరణ కోరగా రైటులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చూస్తామని చెప్పారు. యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే రైతులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.