
Shibin Raghav : రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ క్రికెటర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. సినిమాలో రెండు సార్లు క్రికెట్ మ్యాచ్ లు ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్
Shibin Raghav : రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. ఈ సినిమాలో చరణ్ క్రికెటర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. సినిమాలో రెండు సార్లు క్రికెట్ మ్యాచ్ లు ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ లో చాలా మంది నటులు క్రికెటర్స్ గా కనపడ్డారు. అందులో తలారి ఆంబ్రోస్ అనే పాత్రలో ఈ నటుడు బాగా వైరల్ అయ్యాడు.
ఈ ఆంబ్రోస్ పాత్ర చేసిన నటుడి పేరు శిబిన్ రాఘవ్. పెద్ది సినిమాలో క్రికెట్ మ్యాచుల్లో ఫాస్ట్ బౌలర్ పాత్రలో ఇతను కనిపించాడు. ఇతని బౌలింగ్ సీక్వెన్స్ లు, ఇతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఓ మ్యాచ్ లో ఇతన్ని రామ్ చరణ్ ఎత్తి అవతలకు విసిరేస్తాడు. ఆ సీన్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. అలా క్రికెట్ మ్యాచ్ లో పలుమార్లు కనపడి శిబిన్ రాఘవ్ ఇప్పుడు వైరల్ అయ్యాడు. తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు.
శిబిన్ రాఘవ్ మలయాళీ నటుడు. కేరళలో మోడల్ గా చేసేవాడు. పలు మలయాళం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు. లోక చాప్టర్ 1 సినిమాతో శిబిన్ రాఘవ్ కు మలయాళంలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగులో పెద్ది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తర్వాత శిబిన్ రాఘవ్ కు అభినందనలు వస్తుండటంతో బుచ్చిబాబు తో దిగిన ఫోటోని, సినిమా షూట్ గ్యాప్ లో దిగిన పలు ఫొటోలను షేర్ చేసి తెలుగు ఆడియన్స్ కి, బుచ్చిబాబుకి, చరణ్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపాడు.
ఇతని పర్ఫార్మెన్స్ చుసిన తర్వాత తెలుగులో శిబిన్ రాఘవ్ కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అని తెలుస్తుంది.