
Revanth Reddy: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జల జగడంపై
చర్చలు సాగుతున్నాయని, అతి త్వరలోనే తెలంగాణ ప్రజలకు ఒక మంచి వార్త వింటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, పొరుగు రాష్ట్రంతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. చట్టబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన వాటాలో ఒక్క బొట్టు నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. తాము వివాదాలను సాగదీయడం (పంచాయతీ) కంటే, సమస్యల త్వరితగతిన పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. పాలమూరు, డిండి వంటి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తేనే ఏపీతో తదుపరి చర్చలు ముందుకుసాగుతాయని ఒక రకమైన కండిషన్ పెట్టారు.
read also: Telangana weather update: రాబోయే 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!
గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా తీవ్రమైన వివక్షకు గురైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కనీసం భూసేకరణ ప్రక్రియను కూడా సక్రమంగా పూర్తి చేయకపోవడం వల్లే, ఇంతవరకు ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయామని విమర్శించారు. రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను అక్కున చేర్చుకున్న పాలమూరు జిల్లాను, అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాలమూరును సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే పూర్తి బాధ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని జిల్లా ప్రజలకు భరోసా ఇచ్చారు.
KA Paul: ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
MP Dharmapuri Aravind: ధాన్యం కొనుగోళ్ల వివాదం..సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Bolla Brahmanaidu: తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Telangana weather update: రాబోయే 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!
TG PGECET Results 2026:టీజీ పీజీఈసీఈటీ ఫలితాలు విడుదల
Telangana weather update: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
Puppalaguda land: రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా