
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4)
Jun 5 2026 8:34 PM | Updated on Jun 5 2026 8:42 PM
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4), వర్షిని(5), హరీష్(10)గా గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకొచ్చిన చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బ్రాహ్మణ కుంటలో దిగారు. స్నానం చేద్దామని దిగిన చిన్నారులు అక్కడ లోతు గ్రహించకపోవడంతో అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డారు.
పిల్లలను తల్లిదండ్రులు వెతుక్కునే క్రమంలో బ్రాహ్మణ కుంట వైపు వెళ్లారని ఎవరో చెప్పడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలించగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు