
Lingamaneni Ramesh : జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు అయింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును
Lingamaneni Ramesh : జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు అయింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ ఖరారు చేశారు. 2015 నుంచి జనసేన పార్టీ, పవన్ కల్యాణ్‌తో రమేష్‌కి మంచి అనుబంధం ఉంది. అప్పటినుంచి పవన్ వెన్నంటే లింగమనేని నడిచారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత ఉండాలని, అందుకు తగ్గ సోషల్ ఇంజినీరింగ్ తప్పనిసరి అవసరమని భావించే పవన్ ఆలోచనలకు తాను ఆకర్షితులై ఆయన వెన్నంటి నిలిచారు.
శనివారం (జూన్ 6)న మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు.
Read Also : PM Surya Ghar : పీఎం సూర్య ఘర్ యోజన.. ఇలా చేస్తే మీ ఇంట్లో నెలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. ఫుల్ డిటెయిల్స్!
‘‘2019 ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైనా.. జనసేన సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడుగా పవన్ పై విశ్వాసంతో ఎలాంటి ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా సహనంతో నిలిచారు. ఇప్పుడు వారందరికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ అవకాశం కల్పించారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ పరిగణనలోకి తీసుకుని అవకాశాలిచ్చారు’’అని హరిప్రసాద్ వెల్లడించారు.
ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమి పొత్తులో టీడీపీకి 3 స్థానాలు, జనసేనకి ఒకటి కేటాయించారు. జనసేన అభ్యర్థి పేరు దాదాపు ఖరారు కాగా, టీడీపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.