
కోల్‌కతా: మమతా బెనర్జీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దశాబ్ధన్నర కాలంగా బెంగాల్‌ను శాసించిన మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రోజు (శుక్రవారం)
Jun 5 2026 7:47 PM | Updated on Jun 5 2026 7:59 PM
కోల్‌కతా: మమతా బెనర్జీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దశాబ్ధన్నర కాలంగా బెంగాల్‌ను శాసించిన మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రోజు (శుక్రవారం) కోల్‌కతా కాళీఘాట్‌లోని ఆమె నివాసంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. ప్రస్తుతం మమతా బెనర్జీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇటీవల తృణముల్ పార్టీలో చీలిక రావడం ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం ఇలా రాజకీయంగా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని చవి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశం ఇప్పుడు మరోసారి హాట్‌టాఫిక్‌గా మారింది.
కోల్‌కతాలోని ఆమె కాళీఘాట్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మమతాపై ఉన్న వ్యతిరేఖత స్పష్టమవుతోంది. అంతేకాకుండా అత్యధిక సంఖ్యలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఈ భేటీని బహిష్కరించారు.తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న 28 మంది లోక్‌సభ ఎంపీలలో కేవలం నలుగురు మాత్రమే శుక్రవారం నాటి సమావేశానికి వచ్చారు. (వీరిలో మమతా బెనర్జీ 13 మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం ఇద్దరే డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్ మాత్రమే హాజరయ్యారు.
అయితే ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగురవేసిన "రీతాబ్రతా బెనర్ మాట్లాడుతూ మమతా బెనర్జీని తమ నాయకురాలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మాకున్న ఎమ్మెల్యేల బలం 2/3 వంతు కంటే ఎక్కువే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి మా సంఖ్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. వేచి చూడండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అయితే ఎంపీల విషయమై గత ఏడు రోజులుగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు, కాబట్టి వారి గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను" అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. రీతాబ్రతా బెనర్జీకి ప్రస్తుతం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సమాచారం .
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు