
మీ కాఫీని మరింత హెల్తీగా మార్చే సూపర్ సీక్రెట్.. రుచి అదిరిపోద్దిమీ కాఫీని మరింత హెల్తీగా మార్చే సూపర్ సీక్రెట్.. రుచి అదిరిపోద్ది 05 June 2026 TV9 Telugu TV9 Telugu కప్పు కాఫీ తాగనిదే
చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. ఇలా సందర్భం ఏదైనా కాఫీ నీళ్లు గొంతు తడపాల్సిందే TV9 Telugu
అయితే కాఫీని రోజు మాదిరి కాకుండా కాస్త విభిన్న రుచిలో తాగాలనుకునే వారికి ఈ చిట్కా భలే పనిచేస్తుంది. వంటగదిలోని ఈ చిన్న వస్తువు మరిగించే కాఫీలో వేస్తే రుచి రెట్టింపు అవడంతోపాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు TV9 Telugu
వంటలకు రుచిని పెంచే దాల్చిన చెక్క.. ఇది కూడా కాఫీకి రుచి, సువాసనను జోడించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను అందించే పదార్థంగా గుర్తింపు పొందింది
కాఫీలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్పందన మెరుగుపడే అవకాశం ఉంటుంది
దీంతో గ్లూకోజ్‌ను శరీరం మరింత సమర్థంగా వినియోగించుకోగలుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందట
అయితే ఈ పదార్థాలను కాఫీలో చేర్చడం వల్ల కొన్ని ప్రయోజనాలు లభించే అవకాశం ఉన్నప్పటికీ, అవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి
సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్రతోపాటు కాఫీని పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది
చిన్న మార్పులతోనే ప్రతిరోజూ తాగే కాఫీని మరింత పోషకవంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరూ రేపట్నుంచి ఇలా తాగేయండి
మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి