
అందాల భామ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో జెస్సీగా
అందాల భామ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో జెస్సీగా నిలిచిపోయింది.
అందాల భామ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో జెస్సీగా నిలిచిపోయింది. ఈ సినిమా తరువాత సామ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా తెలుగు ప్రేక్షకుల మదిలో ఆమె ఎప్పటికీ కుందనపు బొమ్మనే. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం సినిమాలో నటించింది. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అన్ని బావుండి ఉంటే.. మేలోనే బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక చివరికి జూన్ 19 న మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకుముందులా కాకుండా ఈసారి బంగారం చాలా గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమైంది. బంగారం ప్రమోషన్స్ లో సామ్ లుక్ ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే వస్తోంది. తాజాగా సామ్.. జెస్సీ లుక్ ని రీక్రియేట్ చేసింది.
ఏ మాయ చేసావే చిత్రంలో సామ్.. నిండుగా చీర కట్టుకొని.. లూజ్ హెయిర్ తో ఎంతో అందంగా కనిపించింది. ఇప్పుడు కూడా అదే లుక్ తో మెరిసింది. గ్రీన్ కలర్ చీర.. దానికి కాంట్రాస్ట్ గా ఎల్లో కలర్ బ్లౌజ్.. లూజ్ హెయిర్, చిన్న బొట్టు పెట్టుకొని కనిపించింది. ఇక సామ్ ని చూసినవారంతా.. 16 ఏళ్ళ కిందటి జెస్సీని చూసినట్టు ఉందే అని కొందరు.. కుందనపు బొమ్మ మళ్ళీ తిరిగివచ్చింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి మా ఇంటి బంగారం సినిమాతో సామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.