
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన 100 వ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన 100 వ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన 100 వ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నాగార్జున సొంతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి దాకా నాగ్ పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రలో ఆయన కనిపించనున్నారట. రెండు తరాలకు చెందిన కథతో ఈ మూవీ రూపొందుతోంది యంగ్ లుక్ కోసం మేకర్స్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో టబు ఒక హీరోయిన్ గా నటిస్తోండగా.. సుస్మిత భట్ మరో హీరోయిన్ గా నటిస్తోందని టాక్.
ప్రస్తుతం కింగ్ 100 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ప్రతిసారిలానే నాగ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను దింపుతున్నారని వార్తలు వచ్చాయి. పండగ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఈ ఏడాది దసరానే బెస్ట్ ఆప్షన్ అని మేకర్స్ భావిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్ కూడా శరవేగంగా ప్లాన్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కింగ్.. సంక్రాంతికి కాదు దసరాకే దిగుతున్నారట.
ఈ ఏడాది దసరాకే కింగ్ 100 వ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాగ్ ప్రయత్నిస్తున్నారు. తన 100వ సినిమా అభిమానులందరికీ పండగలా ఉండేలా.. అటు మాస్ ఎలిమెంట్స్, ఇటు నాగ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ కలగలిపిన కథనే లాక్ చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట మేకర్స్. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.