
ఇంటి గోడలకు మేకులు కొట్టడం, డ్రిల్లింగ్ చేయడం సర్వసాధారణం. అయితే దీనివల్ల గోడల అందం దెబ్బతింటుందని, మరమ్మతులు చేయాల్సి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా అర్జెంటీనాకు చెందిన ఓ
ఇంటి గోడలకు మేకులు కొట్టడం, డ్రిల్లింగ్ చేయడం సర్వసాధారణం. అయితే దీనివల్ల గోడల అందం దెబ్బతింటుందని, మరమ్మతులు చేయాల్సి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా అర్జెంటీనాకు చెందిన ఓ యువ ఆవిష్కర్త సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. 'ఐరన్ప్లాక్' పేరుతో అతడు రూపొందించిన ప్రత్యేక మిశ్రమంతో, ఇకపై గోడలకు మేకులు, స్క్రూలు లేకుండానే వస్తువులను సులభంగా తగిలించుకోవచ్చు.అర్జెంటీనాకు చెందిన 29 ఏళ్ల మార్కో అగస్టిన్ సెక్కీ ఈ వినూత్న ఆవిష్కరణ చేశాడు. ఐరన్ప్లాక్ అనేది ఒక ప్రత్యేకమైన సిమెంట్ లేదా ప్లాస్టర్ మిశ్రమం. ఇందులో కొన్ని ఖనిజాలు, ఇనుము సంబంధిత పదార్థాలను కలుపుతారు. ఈ మిశ్రమంతో గోడకు పూత వేసినప్పుడు, ఆ గోడ ఒక మాగ్నెటిక్ ఉపరితలంలా పనిచేస్తుంది. దీనికి విద్యుత్ అవసరం లేదు. ఫ్రిజ్ డోర్‌కు అయస్కాంతాలు ఎలా అంటుకుంటాయో, అదే విధంగా ఈ గోడలకు కూడా అయస్కాంతాలు ఉన్న వస్తువులు అతుక్కుంటాయి.ఈ టెక్నాలజీతో ఫొటో ఫ్రేమ్‌లు, అద్దాలు, పనిముట్లు, చిన్న షెల్ఫ్‌ల వంటి వాటిని గోడలకు ఎలాంటి నష్టం కలగకుండా అమర్చుకోవచ్చు. వాటి స్థానాన్ని మార్చాలనుకుంటే సులభంగా తీసి మరోచోట పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పైలట్ టెస్టింగ్ దశలో ఉంది. అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఇది ఎంత బరువును మోయగలదు, ఎంతకాలం మన్నుతుంది అనే అంశాలపై పూర్తిస్థాయి పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ ఆవిష్కరణ విజయవంతమైతే నిర్మాణ, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాలలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశం