
సూర్య టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ
సూర్య టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు త్వరలోనే పెద్ద షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. సూర్య టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. సూర్య కెప్టెన్సీ కోల్పోతున్నాడనే వార్తలు తనను ఆశ్చర్యపరచలేదని పేర్కొన్నాడు.
‘నాకు ఈ వార్తలు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. నిజానికి రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోయినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఇలాంటి నిర్ణయాలు సహజంగానే కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇది పెద్ద నిర్ణయమే. కానీ రోహిత్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఇంకా పెద్దది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నామనే సందేశాన్ని బీసీసీఐ ఇవ్వాలనుకుంటోందని నాకు అనిపిస్తుంది’ అని కైఫ్ వెల్లడించాడు.
‘సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ అందించాడు. అందుకే అతడు జట్టులో కొనసాగేందుకు అర్హుడు. ప్రస్తుతం పరుగులు చేయకపోవచ్చు. కానీ జట్టు విజయవంతంగా ముందుకు సాగుతుంటే ఒక ఆటగాడి ఫామ్‌ను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. నాయకుడిగా అతడు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. అందుకే అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ జట్టులో మాత్రం చోటివ్వాలి’ అని కైఫ్ పేర్కొన్నాడు. టీ20 జట్టులో నాయకత్వ మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. సూర్య భవిష్యత్తుపై జరుగుతున్న చర్చలు భారత క్రికెట్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కెప్టెన్సీ మార్పు నిజమైతే అది టీమిండియా టీ20 ప్రణాళికల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. రాబిన్సన్ బౌలింగ్‌లో వైభవ్ నిలబడగలడా?
టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి పంత్ తొలగింపు.. గంభీర్ రియాక్షన్ ఇదే!