
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
AP TET 2026 Notification Apply Link: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులతోపాటు ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా దీనికి అర్హత సాధించాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2026 నోటిఫికేషన్‌ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఉన్న వివరాలను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. టెట్ పాస్ అయిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలల్లో టీచర్లుగా చేరవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5, 2026 వరకు సమయం ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేస్తూ రూ.1000 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుల ప్రక్రియ జూన్ 5, 2026 నుండి ప్రారంభమై జూలై 5 వరకు కొనసాగుతుంది. జూలై 15 నుండి ఆన్లైన్లో మాక్ టెస్టులు ప్రారంభమవుతాయి. హాల్ టికెట్లు అదే నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి. ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుండి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తారు. పరీక్షల తర్వాత, ఆగస్టు 24న ప్రాథమిక సమాధాన పత్రాలను విడుదల చేస్తారు. అభ్యంతరాల కోసం ఆగస్టు 25 నుండి 31 వరకు అవకాశం ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 8న తుది సమాధాన పత్రాన్ని విడుదల చేస్తారు. ఏపీ టెట్ ఫలితాలను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. దీని తర్వాత అక్టోబర్ 2026లో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది, డీఎస్సీకి టెట్ తప్పనిసరి.
ఏపీ టెట్ 2026 దరఖాస్తు విధానం.. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న 'ఏపీ టెట్ 2026' అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేసిన తర్వాత, మీ విద్యా అర్హతలను నమోదు చేసి మీకు కావలసిన పేపర్‌ను ఎంచుకోవాలి. చివరగా ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయ్యాక కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఏపీ టెట్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించబడుతుంది. ప్రతి పేపర్‌కు 150 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పేపర్-1 అనేది 1 నుండి 5వ తరగతి వరకు బోధించే టీచర్ల కోసం, పేపర్-2 అనేది 6 నుండి 8వ తరగతి వరకు బోధించే అభ్యర్థుల కోసం రూపొందించారు. ఒక్కో పేపర్‌కు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.