
Jana Nayagan Movie Delay: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న ల్యాండ్‌మార్క్ పొలిటికల్
Jana Nayagan Movie Delay: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న ల్యాండ్‌మార్క్ పొలిటికల్ డ్రామా ‘జననాయగన్‘ (Jana Nayagan). హెచ్.వినోద్ దర్శకత్వంలో, సామాజిక-రాజకీయ కథాంశంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం కారణంగా ఈ సినిమా బిజినెస్ వ్యవహారాల్లో ఒక ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. బయ్యర్ల నష్టాలను దృష్టిలో ఉంచుకుని విజయ్ తీసుకున్న ఉదార నిర్ణయం ప్రస్తుతం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also:NBK 111 Movie Update: బాలయ్య ‘NBK111’ నుంచి అదిరిపోయే అప్డేట్!
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.సెన్సార్ సర్టిఫికెట్ జారీలో నెలకొన్న వివాదాల కారణంగా గత ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేశారు. రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేకపోవడంతో, భారీ మొత్తంలో పెట్టుబడులు లాక్ అయిపోయి బయ్యర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తన సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో హీరో విజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు జరిగిన అన్ని థియేట్రికల్ అగ్రిమెంట్లను తక్షణమే రద్దు చేసి, బయ్యర్ల నుండి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలని నిర్మాతలకు గట్టిగా సూచించారు. విజయ్ ఇచ్చిన సలహాతో అప్రమత్తమైన కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ వెంటనే అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. తమిళనాడు బయ్యర్ల నుండి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను తిరిగి చెల్లించడమే కాకుండా.. ఈ ఆరు నెలల కాలానికి సరిపడా వడ్డీని కూడా కలిపి సెటిల్ చేసే పనిలో పడింది నిర్మాణ సంస్థ.
సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాత ఎవరికీ భారం లేకుండా సొంతంగా రిలీజ్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. సాధారణంగా ఒక అగ్ర హీరో సినిమాకు సంబంధించి అగ్రిమెంట్లు రద్దయి, అడ్వాన్సులు వడ్డీతో సహా వెనక్కి ఇచ్చిన దాఖలాలు చిత్ర పరిశ్రమలో చాలా అరుదు. ఒక వైపు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటూనే, మరోవైపు సినిమా బయ్యర్ల కష్టాలను గుర్తించి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై డిస్ట్రిబ్యూటర్లు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Malda pre-poll SIR: మాల్దా ఎన్నికల ముందు ఎస్ఐఆర్ సంబంధిత హింసా కేసులో ఇద్దరు అరెస్టు
Peddi movie piracy: పెద్ది సినిమాకు పైరసీ కష్టాలు.. బాక్సాఫీస్ వసూళ్లపై దెబ్బ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
NBK 111 Movie Update: బాలయ్య ‘NBK111’ నుంచి అదిరిపోయే అప్డేట్!
James Handy death: ప్రేయసి కుమారుడి చేతిలో హతమైన హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ
Mega 158 movie: శరవేగంగా సాగుతున్న ‘మెగా 158’ షూటింగ్
Peddi First Day Collections : ‘పెద్ది’ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు