గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, 'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు అద్భుతమైన ప్రతిభతో మలిచిన భారీ పాన్-ఇండియా క్రీడా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సంచలన విజయంతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, 'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు అద్భుతమైన ప్రతిభతో మలిచిన భారీ పాన్-ఇండియా క్రీడా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సంచలన విజయంతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ కెరీర్లో ఒక పవర్ఫుల్ హిట్ పడటంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు.* బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం.. ఫస్ట్ డే ఎన్ని రూ.కోట్లు వచ్చాయంటే! తొలిరోజే రూ. 135 కోట్లు!ఈ సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందనను ప్రతిబింబిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక కలెక్షన్ల వివరాలను వెల్లడించింది. మొదటి రోజే 'పెద్ది' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్ సోలో కెరీర్లోనే ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఈ అసాధారణమైన వసూళ్లతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం, నిజమైన ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ అంటూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద ఇంతటి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో, 'పెద్ది' చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలైన రెండో రోజే కొన్ని ప్రముఖ పైరసీ వెబ్సైట్లలో ఈ చిత్రం హైక్వాలిటీ ప్రింట్ రూపంలో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్లో హై క్వాలిటీ కాపీలు అందుబాటులోకి రావడంతో మెగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.* తమిళనాడు రాజకీయాల్లో సంచలనం... తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక బరిలో రాఘవ లారెన్స్? థియేటర్లలో అద్భుతమైన విజువల్ వండర్‌గా కొనసాగుతున్న ఈ సినిమా వసూళ్లపై, ఈ ఆన్లైన్ లీకేజీ ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పైరసీ లింకులను ఇంటర్నెట్ నుండి తక్షణమే తొలగించాలని డిజిటల్ టీమ్‌ను కోరుతున్నారు. అలాగే ఈ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ చిత్ర యూనిట్‌ను, సైబర్ క్రైమ్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. పైరసీ భూతాన్ని ఎదుర్కొని 'పెద్ది' లాంగ్ రన్లో ఎలాంటి రికార్డులను ఎలా తిరగరాస్తుందో చూడాలి.