
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి
Jun 5 2026 3:00 PM | Updated on Jun 5 2026 3:08 PM
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి రోజు రూ. 135 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ది ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని చెబుతున్నారు. కథతో సంబంధం లేకుండా కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే ఆమెను పరిమితం చేశారని విమర్శిస్తున్నాయి.
అంతేకాదు దేవరతో పోలిస్తే.. ఇందులో ఆమె నటన మరింత దారణంగా ఉందని చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు, నడక..ఇవన్నీ బీగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్విని ఇలాంటి సినిమాల్లో నటించడానికి జాన్వీని అనుమతించేది కాదు అని నెటిజన్లు పోస్ట్ చేశారు.
ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే జాన్వీ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో చాలా బాగా నటిందని ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్లో వచ్చి ఎమోషనల్ సన్నివేశంలోనూ జాన్వీ నటన బాగుందని చెబుతున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
నైరుతి ఎంట్రీ.. ఏపీ, తెలంగాణలో వర్ష్పాల జోరు
పెద్ది సూపర్ సక్సెస్... ఉపాసనకు దిష్టి తీసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
నీకు భజన చేయకపోతే కేసులా... ఏం చేస్తావో చేసుకో...
ఇప్పుడు బీచ్ లో బార్ అండ్ రెస్టారెంట్లు.. త్వరలో రెడ్ లైట్ ఏరియా కూడా..!