
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM dk shiva kumar reacts on minister Ramalinga reddy resignation row: కర్ణాటక రాజకీయాలు మరోసారి దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే సిద్దరామయ్యతో పవన్ షేరింగ్ విషయంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి సిద్దరామయ్యను ఎన్నోరకాలుగా బుజ్జగించడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవల కర్ణాటక ముఖ్య మంత్రిగా డీకే శివకుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. 13 మంది కేబినెట్ మంత్రులుగా సైతం బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి మంత్రిమండలి ఏర్పడిన కొన్నిరోజులకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసమ్మతి జ్వాలలు బైటపడ్డాయి.
తనకు ఆశించిన మంత్రి పదవి దక్కలేదని సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి తనకు కేటాయించిన భారీ, మధ్య తరహా నీటి పారుదలకు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘బెంగళూరు నగరాభివృద్ధి’ శాఖను తనకు కేటాయించక పోవడంతో సీనియర్ నేత అలిగి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తనదైన స్టైల్ లో స్పందించారు.
మంత్రి రామలింగా రెడ్డిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఆయన చాలా సీనియర్ నేత అని చెప్పుకొచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని ఈ వివాదంను అంతర్గతంగా చర్చలు జరిపి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరంలేదన్నారు.
ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాల్లో మంత్రి రాజీనామా అంశం తీవ్ర రచ్చగా మారింది. మరో రాజీనామా చేసిన నేత రామలింగారెడ్డి మాత్రం.. గతంలో సిద్దరామయ్య సీఎంగా ఉన్నప్పుడు ఈ శాఖను డీకే శివకుమార్ నిర్వహించేవారు. ఈ శాఖను తనకు కేటాయిస్తానని డీకే గతంలో తనకు రెండు సార్లు చెప్పారని అన్నారు. మాట తప్పడంతో హర్ట్ అయి రాజీనామా చేసినట్లు రామలింగారెడ్డి తెల్చి చెప్పారు.
Read more: Mohali Murder: ఆఫీసులోనే దారుణం.. గర్ల్‌ఫ్రెండ్‌ను 20 సార్లు పొడిచి చంపి, గొంతు కోసుకున్న ఉన్మాది! CCTV విజువల్స్..
అంతే కాకుండా.. విలేకరుల ముందే ఆయన రాజీనామా లేఖపై సంతకం చేశారు. తన రాజీనామా లేఖను మరో వ్యక్తితో రాజీనామా లేఖను పంపిస్తానని అన్నారు. మరోవైపు సీఎంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని రామలింగారెడ్డి చెప్పడం కొసమెరుపుగా చెప్పుకొవచ్చు. ప్రస్తుతం కృష్ణ బైరె గౌడకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖను కేటాయించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.