
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Karnataka Politics New Turn: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తన శాఖపై సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఆయన రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. ఆయన బెంగళూరు నగర అభివృద్ధిశాఖ ఆశించారు. ఈ శాఖ కేటాయిస్తామని డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాను ఏ నాడు పదవుల కోసం ఆశపడలేదని చెప్పారు. సిద్ధరామయ్య కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు రామలింగారెడ్డి.
సిద్ధరామయ్య కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేసన రామలింగారెడ్డి..
కొత్త బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన కేబినెట్లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు.
ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి. పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఈ కేబినెట్లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ పోర్ట్‌ఫోలియోలను కూడా ఆయనే చూసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. బృహత్ బెంగళూరు అభివృద్ధి శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.