
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన చారిత్రాత్మక రికార్డు త్వరలోనే బద్దలు కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన చారిత్రాత్మక రికార్డు త్వరలోనే బద్దలు కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, త్వరలోనే భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపిక కానున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం 15 ఏళ్ల 70 రోజుల వయసున్న వైభవ్‌ను, ఈ నెల చివర్లో ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించి అత్యంత పిన్న వయసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా నిలిచే సువర్ణావకాశం ఉంది.
Read Also : Pandya brothers: పాండ్య సోదరుల మధ్య గొడవలు నిజమేనా?
వైభవ్ సూర్యవంశీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల తరహాలోనే అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు, మానసిక దృఢత్వం ఉన్నాయని 1983 ప్రపంచకప్ విజేత మదన్ లాల్ కొనియాడారు. ఈ 15 ఏళ్ల అద్భుత కుర్రాడిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా జాతీయ జట్టులోకి తీసుకురావాలని ఆయన సెలెక్టర్లకు గట్టిగా సూచించారు. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న వైభవ్, ప్రస్తుతం జూన్ 9 నుంచి శ్రీలంకలో జరిగే ఇండియా-ఏ ట్రై-సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఒకవేళ ఐర్లాండ్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, అతను ఈ సిరీస్ మధ్యలోనే సీనియర్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం.
మరోవైపు భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శనివారం జరగబోయే సెలెక్షన్ కమిటీ సమావేశంలో సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 సారథిగా ప్రకటించే అవకాశం ఉంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, అలాగే ఆ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ దీర్ఘకాలిక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ సరికొత్త శకానికి నాంది పలుకుతూ టీమ్ఇండియాలోకి అడుగుపెట్టేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Ramalinga Reddy Resignation:కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా!
Supreme Court On Govt Jobs:తక్కువ అర్హత గల ఉద్యోగాలకు ఉన్నత విద్యావంతులు అన్‌ఫిట్!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
FIFA World Cup 2026: మెక్సికో అద్భుత విజయం.. సెర్బియాపై 5-1తో ఘన విజయం
Team India T20 Captain: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్
Pandya brothers: పాండ్య సోదరుల మధ్య గొడవలు నిజమేనా?
Aditya Mehta Foundation: పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
Rishabh Pant: పరిస్థితులకు అనుగుణంగా ఆడాలి.. రిషభ్ పంత్‌కు అసిస్టెంట్ కోచ్ కీలక సూచన