
Pahlaj Nihalani: భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, సెన్సార్ బోర్డు (CBFC) మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ (76) ఇకలేరు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి (లివర్
Pahlaj Nihalani: భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, సెన్సార్ బోర్డు (CBFC) మాజీ చైర్మన్ పహలాజ్ నిహలానీ (76) ఇకలేరు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి (లివర్ సిర్రోసిస్)తో బాధపడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ఇటీవలే ఇంటికి చేరుకున్న ఆయన గురువారం తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని శాంతాక్రూజ్ హిందూ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా ముగిశాయి. ఈ అంతిమయాత్రకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నిహలానీ భౌతికకాయానికి అశ్రునయనాలతో నివాళులర్పించారు.
Read also: Hema: ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ
1950 జనవరి 10న జన్మించిన పహలాజ్ నిహలానీ, 1982లో విడుదలైన ‘హాత్కడి’ అనే సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా 1980, 90వ దశకాల్లో బాలీవుడ్లో కమర్షియల్ చిత్రాల ట్రెండ్‌ను ఆయన శాసించారు. నటుడు గోవిందాను స్టార్ హీరోగా నిలబెట్టడంలో నిహలానీ కీలక పాత్ర పోషించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇల్జామ్’, ‘ఆంఖేన్’, ‘షోలా ఔర్ షబ్నమ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. గోవిందాతో పాటు అనిల్ కపూర్, సునీల్ శెట్టి వంటి స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన మాస్ మసాలా యాక్షన్ సినిమాలను ఆయన నిర్మించారు.
పహలాజ్ నిహలానీ చలనచిత్ర రంగానికే పరిమితం కాకుండా.. 2015 నుండి 2017 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే, ఆయన హయాంలో సెన్సార్ బోర్డు నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదాలకు దారితీశాయి. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు, డైలాగులపై ఆయన తీవ్ర కఠినంగా వ్యవహరించడం, కట్స్ విధించడంపై అప్పట్లో బాలీవుడ్ మేకర్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో ఈయన పదవీకాలం అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది.
పహలాజ్ నిహలానీ అకాల మరణం పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత సీబీఎఫ్సీ బోర్డు ప్రతినిధులతో పాటు, ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న స్టార్ హీరో గోవిందా, చుంకీ పాండే, ప్రముఖ దర్శకుడు అనీస్ బజ్మీ సహా పలువురు సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.
Indi Alliance : ఈనెల 8న ‘ఇండీ’ కూటమి భేటీ
RBI MPC Meeting updates: లోన్ ఈఎంఐ దారులకు ఊరట.. వడ్డీ రేట్లు 5.25% వద్దే యథాతథం ఉంచిన RBI!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Peddi movie piracy: పెద్ది సినిమాకు పైరసీ కష్టాలు.. బాక్సాఫీస్ వసూళ్లపై దెబ్బ!
Puri Jagannadh: ప్రతి ఒక్కరూ దొంగే.. మంచివాళ్లకు అస్సలు చోటు లేదు.. పూరి జగన్నాథ్ సంచలన పోస్ట్
Hema: ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ
Jananayagan clips leaked: విజయ్ మూవీ ‘జననాయగన్’ క్లిప్స్ లీక్..ఆరుగురు నిందితులు అరెస్ట్
Peddi First Day Collections : ‘పెద్ది’ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్