
ఇంటర్నెట్ డెస్క్: హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనకు వచ్చిన ఓ చిన్నారిని రోబో అనుకోకుండా కడుపులో తన్నడంతో అతడు బాధతో విలవిల్లాడాడు. ఈ ఘటన చైనాలోని షింజియాగ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో
ఇంటర్నెట్ డెస్క్: హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనకు వచ్చిన ఓ చిన్నారిని రోబో అనుకోకుండా కడుపులో తన్నడంతో అతడు బాధతో విలవిల్లాడాడు. ఈ ఘటన చైనాలోని షింజియాగ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రోబోల తీరుపై నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేశారు.
వీడియో ప్రకారం.. చైనాలోని షింజియాగ్లోని ఉర్మికి బొటానికల్ గార్డెన్లో గురువారం హ్యూమనాయిడ్ రోబోల (Humanoid robots) ప్రదర్శనను ఏర్పాటుచేశారు. వాటిని చూడడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఓ రోబో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా దానిని చూడడానికి చిన్నారులు చుట్టూ చేరారు. రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ.. అనుకోకుండా అక్కడ నిలబడి ఉన్న ఓ చిన్నారిని కడుపులో బలంగా తన్నింది. దీంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో రోబోల వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపై నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కాగా, రోబో తన్నడంతో గాయపడిన బాలుడికి అక్కడి అధికారులు వెంటనే ప్రథమ చికిత్స చేశారని.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.