
పంజాబ్‌లోని మొహాలీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో దారుణం జరిగింది. ఓ యువకుడు తన సహోద్యోగి, మాజీ ప్రేయసిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం
పంజాబ్‌లోని మొహాలీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో దారుణం జరిగింది. ఓ యువకుడు తన సహోద్యోగి, మాజీ ప్రేయసిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.పోలీసుల వివరాల ప్రకారం.. హర్వీందర్ మాన్ అలియాస్ హ్యారీ అనే యువకుడు, డింపుల్ అనే యువతి పటియాలాకు చెందినవారు. ఇద్దరూ మొహాలీలోని ఓ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వివిధ కారణాల వల్ల కొంతకాలం క్రితం వారు విడిపోయారు.మళ్లీ ఆమెతో కలవాలని హ్యారీ యత్నించినప్పటికీ డింపుల్ నిరాకరించింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన హ్యారీ, గురువారం రాత్రి ఆఫీసులో ఆమెతో గొడవ పడ్డాడు. అనంతరం ఆమె సీట్లో కూర్చుని పనిచేసుకుంటుండగా వెనుక నుంచి వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తోటి ఉద్యోగులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.కత్తితో డింపుల్‌ను 20 సార్లకు పైగా పొడిచి హ్యారీ హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతుపై 30 సార్లకు పైగా పొడుచుకుంటూ ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించగా.. యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.