
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అత్యంత శక్తివంతమైన ఛాయాగ్రహంగా భావిస్తారు. శని నీడగా పిలవబడే రాహువు.. మానవ జీవితాలపై అకస్మాత్తుగా, తీవ్రమైన ప్రభావం చూపుతాడు.
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అత్యంత శక్తివంతమైన ఛాయాగ్రహంగా భావిస్తారు. శని నీడగా పిలవబడే రాహువు.. మానవ జీవితాలపై అకస్మాత్తుగా, తీవ్రమైన ప్రభావం చూపుతాడు. అందుకే ఈయన్ని కలియుగానికి రాజు అని కూడా అంటారు. రాహువు అనుగ్రహం ఉంటే పేదవాడైనా సరే, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు.సాధారణంగా అన్ని గ్రహాలూ నేరుగా నడుస్తుంటే, రాహువు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు కుంభరాశిలోనే సంచరించనున్నాడు. ఈ సంచారం వల్ల మూడు రాశుల వారికి డిసెంబర్ వరకు అదృష్టం వరించబోతోంది. వారి వివరాలను తెలుసుకుందాం.తులా రాశితులారాశి వారికి ఈ రాహు సంచారం ఊహించని విజయాలను తెచ్చిపెడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ఏ పని చేపట్టినా పూర్తి దృష్టితో, పట్టుదలతో పూర్తి చేస్తారు. అదృష్టం తోడుండటం వల్ల అనుకున్న పనులన్నీ సజావుగా సాగి, భారీగా ధనలాభం కలుగుతుంది. కోర్టు వివాదాలు, లీగల్ సమస్యల్లో చిక్కుకున్న వారికి తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. భాగస్వామి మీ వైఖరిని అర్థం చేసుకుని, మీకు అనుకూలంగా మారతారు.ధనూ రాశిధనూ రాశి వారికి రాహువు శక్తివంతమైన ప్రభావం వల్ల డిసెంబర్ 5 వరకు జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ రీత్యా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలన్నీ సులభంగా తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. పెద్దల నుంచి, ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో దైవచింతన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది.మేష రాశిమేష రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ, కుంభరాశిలో రాహువు సంచారం వీరికి ఒక పెద్ద ఊరటగా మారబోతోంది. జీవితంలో ప్రతికూలతలు తొలిగిపోయి కొత్త ఉత్సాహం, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తాయి. వ్యాపార రంగంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అటు వృత్తిని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా సమతుల్యం చేసుకోగలుగుతారు. చదువు పట్ల ఏకాగ్రత పెరిగి, విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది.