
రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త రవాణా, సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూనే, దేశీయంగా రాష్ట్రంలో జల, భూతల...
రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త రవాణా, సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూనే, దేశీయంగా రాష్ట్రంలో జల, భూతల రవాణా వ్యవస్థలను సమూలంగా మార్చేసేలా సరికొత్త ప్రతిపాదనలు చేశారు.సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా (Sistema) ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్ (Tagir Sitdekov)తోనూ, అలాగే మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ (Maksim Liksutov)తోనూ మంత్రి లోకేష్ విడివిడిగా అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించారు. దేశంలో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం, ఏఐ ఆధారిత రవాణా నియంత్రణ, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో రష్యా సాంకేతికతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి.భారతదేశంలో అంతర్గత జలరవాణా, స్మార్ట్ ఫ్లీట్ నిర్వహణను సరికొత్త పుంతలు తొక్కించేందుకు జాతీయ జలరవాణా మార్గాల్లో ఒక ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్‌ను మంత్రి లోకేష్ కోరారు. దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో అసెంబ్లింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. వీటితో పాటు కింది ప్రతిపాదనలను సిస్టమా ముందుంచారు.దుమ్ము రేపిన గవర్నమెంట్ స్కూల్స్, మంత్రి లోకేష్ కు హ్యాట్సాఫ్!హైటెక్ క్లస్టర్లు & శాటిలైట్: ఇస్రో మౌలిక సదుపాయాల సమీపంలో రాబోయే హైటెక్ క్లస్టర్లలో జాయింట్ స్మాల్ శాటిలైట్, గ్రౌండ్ స్టేషన్ సదుపాయాన్ని నిర్మించాలి.గ్రీన్ ఎనర్జీ: భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా భారీ పరిశ్రమల కోసం గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా పైలట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి.ఏఐ & సైబర్ సెక్యూరిటీ: అటానమస్ సీ షిప్ యార్డు, తీరప్రాంత పర్యవేక్షణ కోసం ఏఐ విశ్లేషణలు అందించడంతో పాటు, క్వాంటమ్ వ్యాలీ ఫ్రేమ్ వర్క్ కింద అధునాతన సైబర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వ్యవస్థలను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో భాగస్వామ్యం వహించాలి.ప్యాకేజింగ్ ఉత్పత్తులు: ఏపీ పోర్టుల ద్వారా వచ్చే ముడిసరుకును ఉపయోగించి సిమెంట్, వ్యవసాయ రంగాల కోసం కాగితపు ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీకి సహకరించాలి.దీనిపై స్పందించిన సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్.. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ఎకోసిస్టమ్, ఎస్ఎంఇ ఫైనాన్సింగ్ వంటి సేవలను తాము ఇప్పటికే అందిస్తున్నామని చెప్తూ, మంత్రి లోకేష్ చేసిన సరికొత్త ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.మాస్కో రవాణా మంత్రితో భేటీ: వైజాగ్‌కు సరికొత్త ఫేషియల్ టికెటింగ్!మరో కీలక సమావేశంలో మాస్కో రవాణా మంత్రి మాక్సిమ్ లిక్సుటోవ్‌తో భేటీ అయిన లోకేష్.. ఏపీలోని మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధి, రవాణా రంగ ఆధునీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. విశాఖపట్నం ఫిన్‌టెక్ వ్యాలీలోని మునిసిపల్ ట్రాన్సిట్ లైన్‌ల కోసం అత్యంత సురక్షితమైన ఫేషియల్-రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్‌వర్క్ (ముఖ గుర్తింపు ద్వారా టికెటింగ్)ను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని కోరారు.కోట్లాది ఏళ్ల నాటి రహస్యాలు బయటకి.. డైనో ప్రపంచం’లోకి నారా దేవాన్ష్.. స్మార్ట్ రవాణా కమాండ్ సెంటర్లుమాస్కో నగరంలో విజయవంతంగా నడుస్తున్న సాంకేతికతను భారత్‌లో ప్రవేశపెట్టేలా మంత్రి లోకేష్ మరికొన్ని ప్రతిపాదనలు చేశారు.ఏఐ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్: భారతీయ మెట్రో నగరాల్లో మాస్కో తరహా AI-ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయాలి.ఎలక్ట్రిక్ బస్సులు: అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాలు, స్మార్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగస్వామ్యం వహించాలి.కమాండ్ కంట్రోల్ సెంటర్: భారతీయ నగరాల్లో ఇంటిగ్రేటెడ్ రైలు, మెట్రో, రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ కోసం కమాండ్ సెంటర్ ఏర్పాటుకు మాస్కో రవాణా నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలి.డిజిటల్ లాజిస్టిక్స్: భారతీయ ఓడరేవులలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు, డిజిటల్ ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుకు మాస్కో అధునాతన కార్గో ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను మోహరించాలి. అలాగే మెట్రో కారిడార్లలో ప్రయాణికుల రైలు విస్తరణల ఆప్టిమైజేషన్ కోసం మాస్కో మెట్రో ఇంజనీరింగ్ నిపుణుల సాంకేతిక సహకారాన్ని అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.రష్యాకు చెందిన అటు ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సిస్టమా, ఇటు మాస్కో రవాణా శాఖతో మంత్రి లోకేష్ జరిపిన ఈ ఉన్నత స్థాయి చర్చలు ఆంధ్రప్రదేశ్ రవాణా, ఐటీ రంగాలను గ్లోబల్ లీగ్‌లోకి తీసుకెళ్లడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.