
ఏపీకి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్న రైల్వే శాఖ తాజాగా బాపట్ల జిల్లాలో వేమూరు రైల్వే స్టేషన్ పురోగతికి మార్గం సుగమం చేసింది.
ఏపీకి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్న రైల్వే శాఖ తాజాగా బాపట్ల జిల్లాలో వేమూరు రైల్వే స్టేషన్ పురోగతికి మార్గం సుగమం చేసింది. బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ భారీగా నిధులను మంజూరు చేసింది.రూ. 38.65 కోట్ల నిధులను కేటాయిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులుఈ రైల్వే స్టేషన్‌లో కొత్తగా అదనపు లూప్ లైన్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ. 38.65 కోట్ల నిధులను కేటాయిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఆ రైల్వే ట్రాక్ పై ట్రాఫిక్ .. రైళ్ళ ఒత్తిడి ప్రస్తుతం వేమూరు రైల్వేస్టేషన్ గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌పై ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మార్గం సుగమం చేసే క్రమంలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను నిలిపి ఉంచేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైల్వేశాఖ అదనపు లూప్ లైన్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది.కొత్త లూప్ లైన్ ఏర్పాటుఈ భారీ బడ్జెట్‌లో కేవలం ట్రాక్ నిర్మాణమే కాకుండా స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కొత్త లూప్ లైన్ ఏర్పాటు మరియు దానికి తగిన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థల అమరిక ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 పొడవును మరింత పెంచారు, కొత్తగా ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 ను నిర్మించారు.ప్రయాణికులు సురక్షితంగా ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరొక దానికి వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక సబ్‌వే (అండర్ పాస్) నిర్మాణం చేస్తున్నారు.గోవా బీచ్ లా ఏపీ బీచ్ లలోనూ ఆ ఫెసిలిటీస్.. పండుగ చేస్కోండి!రైళ్ల ఆలస్యం తగ్గుతుందని హర్షం ఈ పనులు పూర్తయితే రైళ్ల ఆలస్యం తగ్గడమే కాకుండా, వేమూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులకు మరింత మెరుగైన రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మరియు గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ కు ఎమ్మెల్యే ఆనంద్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.