
దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది నిరుద్యోగులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) భారీ షాకిచ్చింది.
దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది నిరుద్యోగులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) భారీ షాకిచ్చింది. ఇప్పటివరకూ ఉద్యోగాలు పొందేందుకు ఉన్న అర్హతలతో పాటు అదనపు అర్హతలు కలిగి ఉంటే ఉద్యోగం కచ్చితంగా వస్తుందని భావించేవారు. కానీ ఇకపై అదేమీ కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. దీంతో నిరుద్యోగులు కేవలం తమ అర్హతలకు తగిన ఉద్యోగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.తక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థుల కోసం స్పష్టంగా ఉద్దేశించిన ఉద్యోగానికి, ఉన్నత విద్యా అర్హతలు ఉన్న వ్యక్తిని ఎంపిక చేయకూడదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎవరైనా అలాంటి ఉద్యోగం పొందడానికి తమ ఉన్నత విద్యను దాచిపెడితే, అది నిజంగా అర్హులైన ఇతర అభ్యర్థులకు అవకాశాన్ని దూరం చేస్తుందని కోర్టు తెలిపింది. సిండికేట్ బ్యాంకులోని ఒక తాత్కాలిక బ్యాంక్ అటెండెంట్‌ ఉద్యోగం కేవలం 10వ తరగతి వరకు చదివిన అభ్యర్థుల కోసం మాత్రమే ఉద్దేశించారు. అయితే ఆ వ్యక్తి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు తాను గ్రాడ్యుయేట్ అని వెల్లడించలేదని తేలింది. దీన్ని తప్పుగా తేల్చేన సుప్రీంకోర్టు.. ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతాన్ని ఇది ప్రభావితం చేస్తుందని పేర్కొంది.ప్రభుత్వం ఒక నిష్పక్షపాతమైన యజమానిగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే, ప్రభుత్వ నియామకాలలో తక్కువ అర్హతలు ఉన్నవారికి సమాన అవకాశాలు లభించేలా కొన్ని ఉద్యోగాలను వారికోసం కేటాయిస్తారని గుర్తుచేసింది. ఈ పోస్టులకు ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే, ఆ ఉద్యోగం వాస్తవానికి ఎవరికోసం ఉద్దేశించబడిందో వారి అవకాశాలు తగ్గిపోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా గతంలో తాము ఇచ్చిన కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పును ఉదహరిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్లప్పుడూ నియామక ప్రకటనలో ఉంచిన నిబంధనల్ని మాత్రమే అనుసరించాలని పేర్కొంది. ఉన్నత విద్యార్హత కలిగి ఉండటం వలన తక్కువ విద్యార్హత ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకునే హక్కు ఎవరికీ లభించదని తెలిపింది.