
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సంగీత. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలు పోషిస్తూ సహయ నటిగా రాణిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ టర్నింగ్ పాయింట్స్ , వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం ఒక గొప్ప అనుభవమని సంగీత తెలిపారు. కెరీర్ ప్రారంభంలో మొదటి రోజు షూటింగ్ సమయంలో తనకు ఎవరూ తెలియదని, మేకప్ మ్యాన్ తనకు సరిపడని విధంగా మేకప్ వేసి, జుట్టుకు ఎక్కువగా నూనె రాయడంతో అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడానికే చాలా ఇబ్బంది పడ్డానని పంచుకున్నారు. అయితే దర్శకుడు మాత్రం స్క్రీన్‌పై ఆ లుక్ చాలా పర్ఫెక్ట్గా ఉందని ప్రశంసించారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. ఖడ్గం. ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఖడ్గం సినిమా షూటింగ్ మొదటి రోజు తనకు ఎదురైన ఒక సరదా, విచిత్రమైన సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పట్లో షూటింగ్ సెట్లో తనకు ఎవరూ తెలియదని, కనీసం కెమెరామెన్‌ను కూడా తాను కలవలేదని చెప్పారు. ఆ సమయంలో అక్కడి మేకప్ మ్యాన్ తనకు పూర్తిగా వింతగా, అస్తవ్యస్తంగా మేకప్ వేశారట. ముఖానికి పసుపు రంగు మేకప్ వేసి, జుట్టుకు విపరీతంగా నూనె రాసి నిగనిగలాడేలా చేశాడని సంగీత నవ్వుతూ చెప్పారు. ఆ లుక్ చూసి అద్దంలో తనను తాను చూసుకోవడానికే తీవ్రంగా సిగ్గుపడ్డానని, చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని వివరించారు. "సాధారణంగా మేకప్ అనేది మన రూపాన్ని పెంచాలి (ప్లస్ అవ్వాలి), కానీ అక్కడ అంతా మైనస్ అవుతూ వచ్చింది" అని ఆమె నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నారు. అలాంటి మేకప్‌తో బయటకు రావడానికి మొహమాటపడుతున్న సమయంలో, దర్శకుడు కృష్ణవంశీ రూమ్‌లోకి వచ్చి ఆమెను చూశారట.
అయ్యారు. ఈ చిత్రంలో సినిమా నటి కావాలని కలలుగనే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయి 'లక్కీ' పాత్రలో సంగీత పండించిన హాస్యం, అమాయకత్వం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
[caption id="attachment_1834184" align="alignnone" width="1280"] Sangeetha Movies[/caption]
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..