మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గ్రామీణ క్రీడా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గ్రామీణ క్రీడా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా, మొదటి రోజే ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి రామ్ చరణ్ సోలో కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పినట్లుగా సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ 'సాక్నిల్క్' వెల్లడించిన సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా సుమారు 12,412 షోలలో ప్రదర్శించబడింది. తొలిరోజు భారతదేశం మొత్తం మీద ఈ చిత్రం రూ.69.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇందులో బుధవారం రాత్రి జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన రూ.18.50 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. ఇక దేశీయంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే, మొదటి రోజు రూ.82.49 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ సైతం మెగా పవర్ స్టార్ హవా నడిచింది. అక్కడ సుమారు 3 మిలియన్ డాలర్లకు పైగా అంటే రూ.30.00 కోట్ల వసూళ్లను రాబట్టింది. మొత్తంగా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది.* ‘పెద్ది’ మూవీ రివ్యూభాషల వారీగా చూస్తే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలే టాప్‌లో నిలిచాయి. సాక్నిల్క్ నివేదికల ప్రకారం, తెలుగు వెర్షన్ ద్వారా అత్యధికంగా రూ.47.20 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.3.00 కోట్లు, తమిళంలో రూ.45 లక్షలు, కన్నడలో రూ.25 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షల నికర వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా గ్రాస్ వివరాలను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.48.00 కోట్లు, కర్ణాటకలో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూలైంది.1980-90ల నాటి కాలంలో విజయనగరం జిల్లా నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ టైటిల్ రోల్ 'పెద్ది'గా ఒక భిన్నమైన మాస్ లుక్‌లో కనిపించి అలరించారు. కార్మికుల హక్కులు, స్థానిక క్రీడల చుట్టూ తిరిగే ఈ కథలో, ఒక ప్రతిభావంతుడైన దినసరి కూలి తన గ్రామానికి రైల్వే స్టేషన్, అధికారిక గుర్తింపు తీసుకురావడం కోసం పారా అథ్లెట్‌గా మారి ఎలాంటి త్యాగాలు చేశాడనేది బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' పాత్రలో మెప్పించగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలలో రాణించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, ముఖ్యంగా "చికిరి చికిరి" సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో జనాలు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు, దాదాపు 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఎపిసోడ్, రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న 'పెద్ది' రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.