
విశాఖపట్నం (వన్‌టౌన్), న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో ఓ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి 4.50 కిలోల కణితిని తొలగించారు.
విశాఖపట్నం (వన్‌టౌన్), న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో ఓ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి 4.50 కిలోల కణితిని తొలగించారు. ఈ వివరాలను ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఐ.వాణి గురువారం వెల్లడించారు. విజయనగరానికి చెందిన టి.రజని (37) ఏడాది నుంచి ఉదరం ఉబ్బిపోయి బాధపడుతున్నారు. గత నెల 14న ఆమెకు కేజీహెచ్ యూరాలజీ విభాగంలో పరీక్షలు చేసి అడ్రినల్ గ్రంధిలో కుడివైపు ఆరు సెంటీమీటర్లు, ఎడమవైపున 28 సెంటీమీటర్ల మేర కణితి (సుమారు 4.50 కిలోల బరువు) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ రకమైన సమస్య లక్ష మందిలో నలుగురికే వస్తుంది. దీన్ని వైద్యభాషలో బైలాటరల్ అడ్రినల్ మైలోలిపోమా విత్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లేసియాగా వ్యవహరిస్తారు. కేజీహెచ్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఐ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైద్యబృందం గత నెల 19న శస్త్రచికిత్స నిర్వహించి 4.50 కిలోల కణితిని తొలగించారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో గురువారం డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపారు. ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలక్ష్మి, యూరాలజీ విభాగ వైద్యాధికారులు డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ అప్పలరాజు, డాక్టర్ వెంకటకృష్ణ, పీజీ డాక్టర్ దత్తాత్రేయ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.