
ఎండల తీవ్రతతో స్కూళ్లకు సెలవులు పొడిగింపు జూన్ 14 వరకు విద్యాసంస్థలు బంద్ విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ Summer Holidays Extended: తెలంగాణలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మే నెల ముగిసినా ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను జూన్ 13(Summer Holidays Extended) వరకు పొడిగిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 14న ఆదివారం కావడంతో, జూన్ 15వ తేదీ నుండి ఈ కేంద్రాలు తిరిగి యథావిధిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. BharatPe Flex: భారత్‌పే అదిరిపోయే ఫీచర్.. అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జూన్ 2వ తేదీ నుంచే అంగన్వాడీలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటంతో, 3 నుండి 6 ఏళ్ల లోపు చిన్నారులు వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో విద్యాసంస్థల తరహాలోనే అంగన్వాడీలను కూడా జూన్ 14 వరకు మూసి ఉంచాలని మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవుల పొడిగింపు కేవలం చిన్న పిల్లల రాకకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందే పౌష్టికాహారం, నిత్యావసరాల పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో చిన్న పిల్లల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ సముచిత నిర్ణయం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
.