
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish rao slams on cm Revanth reddy over govt employees da and prc row: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరిగిన విషయం తెలిసిందే. పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గన్ పార్క్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాజాగా.. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఎలు, పీఆర్సీలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ ల ఆలస్యంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంరోజున సీఎం రేవంత్ రెడ్డి తమకు ఏదైన శుభవార్త చెప్తారా అని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూశారన్నారు. భారత దేశంలోనే ఆరు డీఎలు పెండింగ్ లో ఏ రాష్ట్రం కూడా పెట్టలేదన్నారు. అంతే కాకుండా.. పెట్రోల్ రేట్లు, డీజిల్ రెట్లు పెరిగాయి. ఎంతో ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులకు సీఎం రేవంత్ మొండిచేయి చూపించారన్నారు. కనీసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎండకు రేవంత్ రెడ్డి పూర్తిగా సభలో ఉండకుండా.. మధ్యలోనే ముగించేశారన్నారు. ఆరు డీఎలు, పీఆర్సీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇక రిటైర్డ్
ఉద్యోగుల బెనిఫిట్ లు రాక కోర్టుల చుట్టు, ఆఫీసుల చుట్టు తింపుతు వారి గోసను తీసుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు.
గతేడాది పటాన్ చెరువు పరిధిలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది వరకు కార్మికులు చనిపోయారు. ఆ రోజున ఘటన స్థలంకు సీఎం రేవంత్, కార్మిక శాఖమంత్రి వివేక్ వచ్చి రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన చేశారు. ఈరోజు వరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
Read more: CM Revanth reddy: రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
కానీ ఆ ఫ్యాక్టరీ వారు బాధితులకు అండగా నిలిచారన్నారు. సీఎం సాయం చేస్తామని చేసిన ప్రకటనకు ఏదైన ఇజ్జత్ ఉండాలా వద్దా..?.. అంటూ సీఎం రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.